
న్యూస్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “ఇరుముడి” సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమాలో తండ్రీ–కూతుళ్ల బాండింగ్ ప్రధాన హైలైట్గా నిలవనుంది.
ఇక ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్లాసికల్ డాన్సర్ శోభన కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, శోభన మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని సమాచారం. శివ నిర్వాణ తన సినిమాల్లో చూపించే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రంలో కూడా బలంగా కనిపించనున్నాయి. శోభన పాత్రపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!