

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ విస్తృతంగా పోటీకి దిగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 336 వార్డులు, డివిజన్లలో జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నెల 11 వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తన రాజకీయ ఉనికిని స్పష్టంగా చాటుకునేందుకు సిద్ధమైంది.
ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి ఆమోదించడంతో జనసేన అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులందరూ పార్టీ అధికారిక చిహ్నమైన ‘గాజు గ్లాస్’ గుర్తుపై పోటీ చేయనున్నారు. జిల్లాల వారీగా నిజామాబాద్లో 48, నల్గొండలో 46, మహబూబ్నగర్లో 44, కరీంనగర్ కార్పొరేషన్లో 56, కొత్తగూడెంలో 22, రంగారెడ్డిలో 21, వరంగల్లో 20, ఖమ్మంలో 17 చోట్ల పోటీ చేస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన, తెలంగాణలోనూ తన ప్రభావాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!