
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి కేటీఆర్—ఇద్దరూ 2027లో ఒకేసారి పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. లక్ష్యం ఒక్కటే… అధికారంలోకి తిరిగి రావడం. గతంలో పాదయాత్రతోనే విజయం సాధించిన జగన్ మరోసారి అదే వ్యూహాన్ని ఎంచుకోగా, బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ తొలిసారి భారీ స్థాయిలో ఈ రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
తెలుగు రాజకీయాల్లో పాదయాత్ర ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసిందని గతంలో వై.యస్. రాజశేఖరరెడ్డి మరియు నారా చంద్రబాబునాయుడు నిరూపించారు. ఇప్పుడు జగన్–కేటీఆర్ ద్వంద్వ పాదయాత్రలతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంపై జగన్, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ పాదయాత్రలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించనున్నాయి.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!