

భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వ్యాపార డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సంస్థ తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సుమారు 44 వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ, ఈ ఏడాది నియామకాల సంఖ్యను 25 వేలకు తగ్గించింది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఈ సంఖ్య కూడా గణనీయమైనదేనని భావిస్తున్నారు. గత మూడేళ్లుగా సంస్థ ప్రతి సంవత్సరం కనీసం 40 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను నియమిస్తోందని, వ్యాపార అవసరాల ప్రకారం నియామక వ్యూహాలు మారుతాయని టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ కృతివాసన్ తెలిపారు.
అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు వెల్లడైంది. అయితే ఈ తొలగింపులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా జరిగాయని వస్తున్న వార్తలను కృతివాసన్ ఖండించారు. సీనియర్ స్థాయి ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఒక ఫ్రెషర్‌ను పూర్తిస్థాయి ఉద్యోగిగా తయారు చేయడానికి సుమారు 9 నెలల ట్రైనింగ్ అవసరమవుతుందని, అదే అనుభవజ్ఞులైన ఉద్యోగులు అయితే వెంటనే ప్రాజెక్టుల్లో పనిచేయగలరని తెలిపారు. కంపెనీలో మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.


.jpg&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!