
క్రీడలు

ఫిఫా సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘనంగా ముగించింది. మూడో స్థానం కోసం నిన్న నైరోబీలో మాలావితో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం నువ్వానేనా అన్నట్లు సాగగా, భారత్ తరఫున ఆస్తామ్ ఓరాన్ 18వ నిమిషంలో, అవేకా సింగ్ 45వ నిమిషంలో, ప్రియదర్శిని సెల్లాదురై 84వ నిమిషంలో గోల్స్ చేశారు.
మరోవైపు మాలావి తరఫున కుమాలో ఇరిన్ 42వ నిమిషంలో, హెన్రీ దెబోరా 60వ నిమిషంలో గోల్స్ చేశారు. మ్యాచ్ 18వ నిమిషంలో రైట్ కార్నర్‌లో నిర్మలాదేవి ఇచ్చిన పాస్‌ను ఆస్తామ్ ఓరాన్ గోల్‌గా మార్చి భారత్‌కు తొలి ఆధిక్యం అందించింది. 21 ఏళ్ల ఓరాన్‌కు ఇది భారత్ తరఫున తొలి గోల్ కావడం విశేషం. ప్రథమార్థం ముగిసే సమయానికి కొద్ది నిమిషాల వ్యవధిలో ఇరు జట్లు గోల్స్ చేయడంతో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!