
న్యూస్

నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే రెండు ట్యూన్స్ పూర్తి చేశారు. అనంత శ్రీరామ్ ఒక పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాట షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అక్కడే ఒక యాక్షన్ సీన్ కూడా చిత్రీకరించనున్నారు.
అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలకృష్ణను రాజుగా, నయనతారను మహారాణిగా చూపించడం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాపై కథ ఏంటి అనే ఆసక్తి నెలకొంది. థమన్ సంగీతం, భారీ విజువల్స్‌తో ఈ సినిమా బాలయ్య అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా నిలవనుందని చిత్రబృందం భావిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!