

యువతలో అధికంగా సోషల్ మీడియా వినియోగం వారి మానసిక ఆరోగ్యం మరియు సంతోషంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ సంతోష నివేదిక ప్రకారం ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా నిలిచింది. ఈసారి నివేదికలో ప్రధానంగా సోషల్ మీడియా ప్రభావంపై దృష్టి పెట్టారు. యువతలో వినియోగాన్ని నియంత్రించాలా అనే అంశంపై అనేక దేశాలు ఆలోచిస్తున్నాయి.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 25 సంవత్సరాల లోపు యువతలో సంతోషం గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. ముఖ్యంగా అమ్మాయిలలో ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించింది. అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో యువత తమ జీవితాలపై మరింత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
సోషల్ మీడియా ప్రభావం చాలా సంక్లిష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. వినియోగ సమయం, వేదిక రకం, వినియోగ విధానం, లింగం, ఆర్థిక స్థితి వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. అధిక వినియోగం తక్కువ సంతోషానికి దారితీస్తుందని, పూర్తిగా దూరంగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోతారని తెలిపారు. ప్రపంచ దేశాల జాబితాలో యుద్ధ ప్రభావంతో ఆఫ్ఘానిస్తాన్ అత్యల్ప సంతోష స్థాయిని నమోదు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!