

ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నౌకాదళంకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. హర్మూజ్ జలసంధిలోకి నౌకలు ప్రవేశించడం లేదా బయటకు వెళ్లడం అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఈ విషయాన్ని వివరంగా వెల్లడించారు.
అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించే నౌకలను వెంబడించి అడ్డుకోవాలని నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే నౌకలకు అంతర్జాతీయ సముద్రాల్లో భద్రత ఉండదని హెచ్చరించారు. హర్మూజ్‌ను తెరవాలని ఇరాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించడంతోనే చర్చలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు అణ్వాయుధాలు అందకుండా చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!