
టెక్నాలజీ

అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి తిరుపతి జిల్లా నాయుడుపేట వరకు ఉన్న జాతీయ రహదారి-71పై ప్రయాణికుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారి పనుల్లో పారదర్శకత, ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ చర్య తీసుకుంది. సెల్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రహదారి వివరాలు, జరుగుతున్న పనులు, కాంట్రాక్టర్లు, రహదారి నాణ్యత వంటి సమాచారం అందుతుంది.
అదే విధంగా టోల్ గేట్లు, హోటళ్లు, అత్యవసర సేవలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అత్యవసర ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు రహదారి సేవలను మరింత సులభంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!