

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలకు ముందు ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి, తనను ఏదో ఒక విధంగా పాస్ చేయాలని వేడుకున్నాడు. తాను చదవలేదని, ప్రశ్నా పత్రాన్నే మళ్లీ మళ్లీ రాశానని, జవాబు పత్రాల్లో డబ్బు కూడా పెట్టానని చెప్పినట్టు సమాచారం.
విద్యార్థి రికార్డులను పరిశీలించిన అధికారులు, అతను ఫస్ట్ ఇయర్‌లో రెండు సబ్జెక్టులు, సెకండ్ ఇయర్‌లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. దీంతో అతను చదువులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటపడ్డాయి.
అయితే అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా, విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా సిద్ధం కావాలని సూచించారు. అలాగే అతని తల్లిదండ్రులతో మాట్లాడగా, తమ కుమారుడు ఇంట్లోనే ఉన్నాడని, అతన్ని జాగ్రత్తగా చూసుకుంటామని వారు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!