
క్రీడలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో కలపడం పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది పెద్ద కుట్ర అని పేర్కొంటూ, మహిళల పేరుతో బిల్లును అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. మహిళల సాధికారత కోసం ఇది సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
డీలిమిటేషన్ ద్వారా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే అది అసలు సహించబోదని కవిత హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణకు ఉన్న 3.13 శాతం ప్రాతినిథ్యం అదే విధంగా కొనసాగాలని తెలిపారు. అది తగ్గితే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని చెప్పారు.
మహిళా బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు ప్రత్యేక ఉపకోటా ఉండాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. బీసీ మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే ఈ బిల్లుకు ఉన్న అసలు ఉద్దేశం నెరవేరదని ఆమె పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!