

రొమాంటిక్ కామెడీ సినిమా “యూత్” ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రాన్ని కెన్ కరుణాస్ దర్శకత్వం వహించి నటించారు. మార్చి 19న తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందనతో విజయాన్ని సాధించింది. తరువాత మార్చి 27న తెలుగులో విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 16 నుంచి ప్రసారం కానుంది.

ఈ కథలో ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్‌లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్‌లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!