
సినిమాలు

బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్ దిగ్గజ షట్లర్ విక్టర్ అక్సెల్సన్ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ కాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న 32 ఏళ్ల అక్సెల్సన్, ఇకపై కెరీర్ కొనసాగించడం సాధ్యం కాదని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయన ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలికారు.
టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన అక్సెల్సన్, తన కెరీర్లో అనేక అసమాన విజయాలు అందుకున్నాడు. 2017, 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కూడా స్వర్ణ పతకాలు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి వెన్నునొప్పితో బాధపడుతూ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌గా 183 వారాలు కొనసాగి రికార్డు సృష్టించిన అక్సెల్సన్, కోర్టులో ప్రత్యర్థులను భయపెట్టే స్థాయిలో ఆధిపత్యం చూపించాడు.


.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!