

నటుడిగా ప్రేక్షకులను అలరించిన ఆర్జే బాలాజీ, దర్శకుడిగానూ విజయాలు సాధించారు. ‘మూకుతి అమ్మన్’, ‘వీట్ల విశేషం’ తర్వాత ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘కరుప్పు’. దీనికి తెలుగు పేరు ‘వీరభద్రుడు’. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. వచ్చే నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్, సంగీత దర్శకుడి ఎంపిక గురించి వివరించారు.
గతంలో త్రిషతో సినిమా చేయాలని అనుకున్నానని, కానీ అది సాధ్యపడలేదని బాలాజీ చెప్పారు. అందుకే ‘కరుప్పు’ కోసం ఆమెను సంప్రదించగా, కథ విన్న వెంటనే ఆమెకు బాగా నచ్చిందని తెలిపారు. తన పాత్ర కూడా నచ్చడంతో త్రిష ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆమె సెట్స్‌కు వచ్చేవారని తెలిపారు. ‘ఆరు’ సినిమా తర్వాత ఇరవై రెండేళ్లకు సూర్య, త్రిష మళ్లీ కలిసి నటిస్తున్నారని అన్నారు.
సంగీత దర్శకుడి విషయానికి వస్తే, ‘మూకుతి అమ్మన్’ తర్వాత తాను ఒక ప్రముఖ సంగీత దర్శకుడితో కలిసి పని చేయాలని అనుకున్నానని చెప్పారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోయారని తెలిపారు. అప్పటికే సినిమా ప్రారంభమై ఉండటంతో, ఒక పాట అత్యవసరం కావడంతో సాయి అభ్యంకర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు వివరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!