
రాజకీయాలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జుమా నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశముందని భావించిన అధికారులు భద్రతా చర్యలను కఠినతరం చేసి పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మరియు ప్రధాన మత గురువు మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను గృహ నిర్బంధంలో ఉంచారని, చారిత్రక జామియా మసీదును అధికారులు మూసివేశారని ఆయన విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి ఆంక్షలు విధించడం దురదృష్టకరమని ‘ఎక్స్’ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!