
రాజకీయాలు

టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే, విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
తన పార్టీ కేవలం రాజకీయ సంస్థ మాత్రమే కాదని, సామాజిక న్యాయాన్ని కాపాడే కోటగా, ప్రజల గుండెల్లో నిజాయతీని ప్రతిబింబించే శక్తిగా ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో కుటుంబసమేతంగా పాల్గొని ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం కలిసి పోరాడాలని ప్రజలను పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!