
సినిమాలు

లవ్ చిత్రాలకు పేరుగాంచిన సీనియర్ దర్శకుడు ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా కొత్త చిత్రం రూపొందనుంది. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మౌనికా రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది సరికొత్త న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుందని చిత్ర బృందం తెలిపింది.
యువ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు సంభాషణలు అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘స్వాతిముత్యం’, ‘నేను స్టూడెంట్ సర్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన గణేష్, సీనియర్ దర్శకుడు కరుణాకరన్‌తో కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచింది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!