

అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు మరియు బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోవడంతో సుమారు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరి మలేసియా వైపు ప్రయాణిస్తుండగా బలమైన ఈదురుగాలులు, అలల ఉద్ధృతి కారణంగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మరియు అంతర్జాతీయ వలస సంస్థ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు తెలిపారు. మయన్మార్‌లో 2017లో జరిగిన హింస నుంచి తప్పించుకుని బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ శిబిరాల్లో నివసిస్తున్న రోహింగ్యాలు, అక్కడి పరిస్థితులు క్షీణించడంతో మెరుగైన జీవితం కోసం ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.









.jpeg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!