
రాజకీయాలు

అలహాబాద్ హైకోర్టు వైవాహిక జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకుల తర్వాత భార్య, పిల్లలను ఆర్థికంగా పోషించలేమని భావించే వారు పెళ్లి చేసుకోవడం మానుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
వివాహం అనంతరం భర్త చట్టపరంగా బాధ్యత వహించి భార్యకు భరణం చెల్లించాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం చట్టపరంగా సమర్థించబడదని కోర్టు తేల్చి చెప్పింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!