
క్రీడలు

ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ సినిమా ఇప్పుడు 4Kలో మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో మంచి హిట్ అయింది. ప్రభాస్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్, యువతలో మంచి గుర్తింపు తెచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
విడుదలకి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందన కనిపిస్తోంది. లిమిటెడ్ షోలకే నైజాం ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. బుక్‌మైషోలో వేలాది టికెట్లు ఇప్పటికే సేల్ అయ్యాయి. ₹50 లక్షలకుపైగా ప్రీ-సేల్స్ రావడం విశేషం. విడుదలకి ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!