

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత చడలవాడ శ్రీనివాసరావు ₹30 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో టీఎఫ్‌డీఏ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ ఈ నిర్ణయం కొత్త దర్శకులకు గొప్ప అవకాశమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 100 నుంచి 150 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
సాయి రాజేష్, సముద్ర, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరులు ఈ కార్యక్రమం గురించి మాట్లాడారు. సభ్యుల నుంచి వచ్చిన కథలను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చడలవాడ శ్రీనివాసరావు మంచి కథలు, విలువలతో కూడిన సినిమాలను నిర్మించడం తన లక్ష్యమని, లాభాలు వస్తే వాటిని అసోసియేషన్‌కు అందిస్తానని ప్రకటించారు. ఈ ప్రణాళిక పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురానుందని ఆశాభావం వ్యక్తమైంది.











.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!