

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లే అభిమానులకు శుభవార్త. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పోలీసు శాఖతో కలిసి క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో టికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యంగా ఉండటం, రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నకిలీ టికెట్లు కూడా సమస్యగా మారి గొడవలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మ్యాచ్ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు క్యూ ఆర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది.
ఆ తర్వాత అభిమానులు తమకు కేటాయించిన గేట్ల వద్ద కోడ్ స్కాన్ చేయించుకొని సులభంగా లోపలికి వెళ్లవచ్చు. రాజస్థాన్ రాయల్స్–సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వేరే నంబర్‌పై టికెట్ బుక్ చేసిన వారు 5 గంటల ముందుగానే క్యూ ఆర్ కోడ్ షేర్ చేయాలి. ఈ విధానం ద్వారా నకిలీ టికెట్ల సమస్యకు చెక్ పడడంతో పాటు, అభిమానులకు మరింత సౌకర్యం కలగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!