

మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన వాలా 2 సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ రూపంలో రానుంది. తక్కువ ఖర్చుతో తీసిన ఈ చిత్రం 200 కోట్ల దిశగా దూసుకెళ్లింది. ఈ సినిమాను తెలుగు లో విడుదల చేయడానికి సాహు గారపాటి ముందుకు రావడం విశేషం. కొంత ఆలస్యమైనా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చే అవకాశముంది.
థియేటర్లలో కొత్త సినిమాల కొరత ఉన్న సమయంలో వాలా 2 రావడం మంచి ఊపిరిలా మారింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితుల సరదాలు, ప్రేమ, చిన్న చిన్న గొడవలు వంటి అంశాలు ఆకట్టుకునేలా చూపించారు.
ఈ సినిమా కథ యువతకు దగ్గరగా అనిపించేలా ఉంది. ప్రేక్షకులకు నచ్చితే మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కనీసం వారం రోజుల పాటు మంచి స్పందనతో ప్రదర్శన కొనసాగుతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!