

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామక ప్రక్రియను కఠినతరం చేయడానికి చర్యలు చేపడుతూ ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. అమెరికా కార్మిక శాఖ మార్చి 27న హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడం, స్థానిక కార్మికుల వేతనాలను రక్షించడం లక్ష్యంగా కొత్త ప్రతిపాదనలు విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై స్పందించేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. జూన్ 30లోపు దాఖలయ్యే పిటిషన్లపై ఇవి ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా వేతనాలు మరియు అర్హతలపై కఠిన నియమాలు ప్రతిపాదించారు.
ఈ మార్పుల ప్రకారం హెచ్-1బీ వీసాను కేవలం తాత్కాలిక ఉద్యోగాలకే పరిమితం చేయాలని, శాశ్వత నివాసం పొందడానికి ఉపయోగించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే పై చదువులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విదేశీయులను నియమించే ముందు తగిన అమెరికన్ అభ్యర్థి లేడని కంపెనీలు నిరూపించాలి. తక్కువ జీతాలతో విదేశీ ఉద్యోగులను నియమించకుండా ఉండేందుకు కనీస వేతనాన్ని 30% పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే గ్లోబల్ ఉద్యోగ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!