

నటుడు, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయకన్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఆలస్యంపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా రజనీకాంత్ స్పందించకుండా క్షమించండి.. దీనిపై నేను మాట్లాడలేను అని మాత్రమే చెప్పారు. ఇటీవల జైలర్ 2 షూటింగ్‌లో భాగంగా ఒక దశ పూర్తిచేసుకున్న రజనీకాంత్ బుధవారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
తాను మరియు కమల్ హాసన్ కలిసి నటించే కొత్త సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుందని వెల్లడించారు. జైలర్ 2 చిత్రీకరణ కూడా త్వరలో పూర్తవుతుందని, విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. ఇది గతంలో విజయం సాధించిన జైలర్ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక యువతకు రజనీకాంత్ పలు ముఖ్యమైన సూచనలు చేశారు. చదువుకునే సమయంలో చదువుపైనే పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు. ఆ సమయంలో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాంటి అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!