
రాజకీయాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రైవేట్ పాఠశాలలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ స్కూల్స్ ఒకేసారి 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలపై ఫుడ్ సేఫ్టీ, పీఎఫ్ వంటి అంశాలపై తనిఖీలు చేయాలని ఆమె కోరారు. ఏటా 8 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచకుండా ప్రభుత్వం నియంత్రించాలన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్నారని ఆమె తెలిపారు.





.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!