

ఐపీఎల్ 2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక మార్పులు చేసింది. మ్యాచ్‌ల సమయంలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్ల కదలికలపై కఠిన నియంత్రణలు విధించింది. ఇకపై జట్టులో ఎంపికైన 16 మంది ఆటగాళ్లు (ప్లేయింగ్ ఎలెవెన్ + ఐదుగురు ఇంపాక్ట్ సబ్స్) మాత్రమే ఫీల్డ్‌లోకి వెళ్లి డ్రింక్స్, బ్యాట్స్ లేదా సందేశాలు అందించాలి. ఈ జాబితాలో లేని ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మైదానంలోకి అడుగుపెట్టకూడదని స్పష్టం చేసింది.
అదేవిధంగా బౌండరీ చుట్టూ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే బిబ్స్ ధరించి ఉండాలని, మిగతా ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితం కావాలని ఆదేశించింది. బౌండరీ లైన్ మరియు LED బోర్డుల మధ్య కదలికలకు కూడా నిషేధం విధించింది. ఇటీవల కొన్ని జట్లు నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో బీసీసీఐ నియమావళిలోని క్లాజ్ 11.5.2, 24.1.4 ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026లో ఇప్పటికే 13 మ్యాచ్‌లు పూర్తవగా, ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!