

రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం ఇచ్చారు. సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఈ ప్రయాణంలో ప్రతి తెలంగాణ పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేళ్లకు పైగా అవుతున్న నేపథ్యంలో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం తెలిపారు. “మేం పాలకులు కాదు.. సేవకులం” అన్న భావనతో ప్రజల అవసరాలే కేంద్రబిందువుగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు కాగితాలపై కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మార్చి 6న ప్రారంభమైన ఈ 99 రోజుల కార్యాచరణను ఒక ఉద్యమంలా అమలు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అధికార యంత్రాంగం వేగవంతమైన ఫైల్ క్లియరెన్స్, పారదర్శక నిర్ణయాలు, కార్యాలయాల్లో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!