

శంషాబాద్ పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ప్రతిపక్షాలపై నిర్బంధాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, రైతులను కలవకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ఇది ప్రజలకు మంచిది కాదని అన్నారు.
రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం దారుణమని, భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా వెళ్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని హరీశ్ రావు హెచ్చరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!