
క్రీడలు

ధురంధర్ సినిమా కాస్టింగ్‌పై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. రేహ్మాన్ దకాయిత్ పాత్రను మొదట ముగ్గురు నటులు తిరస్కరించారని, ఆ తర్వాత ఆ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారని తెలిపారు. అందులో ఒకరు దక్షిణాది నటుడు కాగా, మరొద్దరు బాలీవుడ్‌కు చెందినవారని ఆయన పేర్కొన్నారు.
సినిమా ప్రధానంగా రణవీర్ సింగ్‌పై ఆధారపడిందని, ఇది మల్టీ స్టారర్ కావడంతో ఆ పాత్రను వదిలేశారని నటులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆ దక్షిణాది నటుడు ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగాయి. నాగార్జున పేరు వినిపించినా అధికారిక ధృవీకరణ లేదు. చివరకు అక్షయ్ ఖన్నా ఆ పాత్రకు సరిపోయారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!