

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం “3.0 వర్షన్”తో సరికొత్త మార్పుల దిశగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు సమూల మార్పులు తీసుకొస్తున్నామని, ప్రతి టర్మ్‌లో కనీసం 33 శాతం కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోందన్నారు. పార్టీ కేడర్ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన లోకేష్.. సభ్యత్వ వ్యవస్థను ఆధార్‌లా రూపొందించామని, ప్రతి కార్యకర్త పనితీరును డిజిటల్‌గా గుర్తిస్తామని వివరించారు. పైరవీలు కాకుండా కష్టపడే వారికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
టిడిపి ఒక కేడర్ ఆధారిత పార్టీ అని, వ్యక్తులు కాదు పార్టీనే శాశ్వతమని లోకేష్ అన్నారు. గతంలో వ్యక్తులపై ఆధారపడటం వల్ల నష్టపోయామని, ఇప్పుడు వ్యవస్థపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. 2014-19లో అభివృద్ధి చేసినా ఓటమి ఎదురైందని, దీర్ఘకాలంగా అధికారంలో ఉండాలంటే క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, పార్టీ సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. చంద్రబాబు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!