
రాజకీయాలు

కరీంనగర్ బైపాస్ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్–పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొకరికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో సయ్యద్ అబ్దుల్ రహమాన్ (19), సయ్యద్ ఆతియాబ్ హుస్సేన్ (21) ప్రాణాలు కోల్పోయారు. ఎండీ అదునాన్ పరిస్థితి విషమంగా ఉండగా, ఎండీ అబ్రార్ కారు నుంచి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!