
న్యూస్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల రాజకీయ పరిణామాల మధ్య ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపిన కేటీఆర్, జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ జగిత్యాలకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు గంగుల కమలాకర్ కూడా జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ప్రత్యక్షంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!