

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లా మరోసారి వాయిదా పడింది. ముందుగా ఈ నెల 10న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను ఇప్పుడు ఈ నెల 17కు మార్చారు. ఈ నెల 16 రాత్రి 9 గంటల నుంచి ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.
మలయాళ సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యూ ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 55 నిమిషాలు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్గా నటిస్తుండగా, టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శన్ మరియు అక్షయ్ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. హారర్ మరియు కామెడీ మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇటీవల వరుస అపజయాల తర్వాత ఈ సినిమా అక్షయ్ కుమార్‌కు విజయాన్ని అందిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!