
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజమండ్రి-విశాఖపట్నం మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజనను మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.12,980 కోట్ల నిధులను కేటాయించారు. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు రూ.9,889 కోట్లతో 198 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అదనంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!