
ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటూ హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు శనివారం ప్రకటించింది. తమ నౌకలకు స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగేందుకు అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు హర్మూజ్‌పై కఠిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. ఇటీవల లెబనాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్‌ను తెరిచినట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు మారిపోయాయి. అమెరికా వైఖరిపై నిరసనగా మళ్లీ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ తెలిపింది.
ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ (ఖతం అల్ అంబియా) ప్రకారం హర్మూజ్ జలసంధి ప్రాంతంలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. హర్మూజ్ మరియు దాని పరిసర ప్రాంతాలను తమ సైనిక దళాలు పకడ్బందీగా నియంత్రిస్తాయని వెల్లడించారు. తమ ఓడరేవులపై ముట్టడి కొనసాగించడం ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. ఈ ముట్టడిని అమెరికా కొనసాగించేంతవరకు హర్మూజ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!