

బాలీవుడ్ అందగత్తె మృణాల్ ఠాకూర్ ఇటీవలి ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించింది. సినిమా రిలీజ్ సమయంలో డేటింగ్ వార్తలు రావడం తనకు అసంతృప్తి కలిగిస్తోందని చెప్పింది. తనకు ప్రేమించేంత సమయం లేదని, కాలికి గాయమైతే చికిత్స చేయించుకోవడానికి కూడా సమయం దొరకడం లేదని ఆమె వ్యాఖ్యానించింది.
గత ఏడాది అజయ్ దేవగన్ సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో చుంకీ పాండేకు భార్యగా నటించిన అనుభవం గురించి మాట్లాడుతూ స్క్రిప్ట్‌లో ఉన్నది ఒకటి, తెరపై చూపించినది మరొకటి అని విచారం వ్యక్తం చేసింది. తనకు చాలా ముఖ్యమైన సీన్స్ కట్ చేశారని, చుంకీ పాండే వంటి సీనియర్ ఆర్టిస్ట్‌ను భర్తగా జత చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పింది. అయితే మూవీపై రిగ్రెట్ లేదని, ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని ఆమె స్పష్టం చేసింది. నెటిజన్లు మాత్రం మృణాల్‌ను టార్గెట్ చేస్తున్నారు.



_1775900374811.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!