

పిల్లల్లో ఊబకాయం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. చిన్నప్పుడు బొద్దుగా కనిపించడం ముద్దుగానే అనిపించినా, అది భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య సుమారు 4 కోట్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది ఈ సంఖ్య సుమారు 5 శాతం పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.
జీవనశైలి మార్పులు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి అంశాలు ఊబకాయాన్ని పెంచి షుగర్, గుండె జబ్బుల వంటి సమస్యలకు దారితీస్తాయి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన నిద్రతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రారంభ దశలోనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!