

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘FNCC-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ లీగ్ ప్రతి శని, ఆదివారాల్లో ఘనంగా నిర్వహించబడుతూ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీకి టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు హాజరయ్యారు. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్‌లో ప్రతి జట్టు రూ.10 లక్షల ఎంట్రీ ఫీజుతో బరిలోకి దిగడం విశేషం.
ఫైనల్‌లో వాయుపుత్ర టైగర్స్ జట్టు ఛాంపియన్‌గా నిలవగా, ఎలిగెన్స్ ఈగల్ రన్నరప్‌గా నిలిచింది. పోరూస్ పాంథర్స్ మూడో స్థానం, ఎఫ్ఎన్‌సీసీ లయన్స్ నాలుగో స్థానం దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో నిఖత్ జరీన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో ఈ లీగ్‌ను మరింత విస్తరించి, లైవ్ టెలీకాస్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!