

కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా మరియు మీడియా వేదికలపై “సేవ్ పునర్విక.. పునర్వికను కాపాడుకుందాం” అనే ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. లక్షలాది మంది స్పందించి సహాయం అందించగా, మరికొందరు ప్రార్థనలతో మద్దతు తెలిపారు. చిన్నారి చికిత్స కోసం అవసరమైన నిధులు భారీగా సమకూరుతుండగా, మరోవైపు రూ.6 కోట్ల అవసరం ఉన్న సమయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించారు. అవసరమైనంత నిధులను సమీకరిస్తానని, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని ఆయన ఇచ్చిన హామీతో పునర్విక తల్లిదండ్రుల్లో ఆశ చిగురించింది. తాను అన్నలా బాధ్యత తీసుకుని చిన్నారి చికిత్స కోసం విదేశాల నుంచి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్‌ను హైదరాబాద్‌కు రప్పించడంలో కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో వైద్యుల సమక్షంలో జోల్‌జెన్‌స్మా అనే ఈ ఇంజెక్షన్‌ను చిన్నారికి విజయవంతంగా అందించారు. ఈ సమయంలో మంత్రి స్వయంగా అక్కడే ఉండి వైద్యులతో చికిత్స వివరాలు తెలుసుకుని, ఏడుస్తున్న చిన్నారిని ప్రేమగా లాలించారు. అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న పునర్వికకు ఇదే జీవనాధారమైన చికిత్సగా వైద్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా దాతల సహాయం, సోషల్ మీడియా స్పందనతో నిధులు సమకూరగా, మొత్తం ప్రక్రియలో మంత్రి లోకేష్ నిరంతర పర్యవేక్షణ చేశారు. చికిత్స విజయవంతం కావడంతో చిన్నారి ఆరోగ్యం మెరుగుపడగా, కుటుంబం భావోద్వేగానికి లోనై ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఇది తమ చిన్నారికి నిజమైన పునర్జన్మగా భావిస్తున్నామని, లోకేష్ మానవతా సహాయం జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!