

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల (ఏప్రిల్ 8–22) కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం తక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 22లోగా ఇరాన్ తమతో కొత్త ఒప్పందానికి వస్తుందా లేదా అన్నదానిపై భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం ముట్టడిని కొనసాగిస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా అవసరమైతే మళ్లీ ఇరాన్‌పై సైనిక చర్యలు తప్పవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలుగా అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఘర్షణలు ఈ నెల 7 వరకు కొనసాగినట్లు సమాచారం. ఈ కాలంలో ఇరాన్ పలు అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేసిందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.








.jpeg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!