
రాజకీయాలు

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 18 )తో పాటు 21 తేదీ మరియు వచ్చే నెల 3, 6, 22 తేదీల్లో కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. మ్యాచ్ సమయాల్లో స్టేడియం పరిసరాల్లో లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, జేసీబీలు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు వంటి భారీవాహనాలకు అనుమతి ఉండదు.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. నాగోల్ నుంచి హబ్సిగూడ, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే స్టేడియంలో పార్కింగ్ అనుమతి ఉంటుంది.


.jpeg&w=3840&q=75)


.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!