
న్యూస్
.jpeg&w=3840&q=75)
ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ సభను విజయవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం వల్ల ఉత్తర తెలంగాణలో పార్టీ మరింత బలపడిందని అన్నారు. లక్ష మందితో భారీగా ఈ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.




















.jpeg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!