
న్యూస్

2025–26 ఆర్థిక సంవత్సరంలో తిరుమల శ్రీవారి దర్శనాలకు రికార్డు స్థాయి భక్తుల రద్దీ నమోదైంది. రోజుకు సగటున 73 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటుండగా, గత 2023–24, 2024–25 సంవత్సరాల్లో ఈ సంఖ్య 70 వేలుగా ఉండేది. దీంతో గతంతో పోలిస్తే 4.57 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలలుగా ప్రతి నెలా రూ.120 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. అలాగే తిరుమల లడ్డూ విక్రయాల్లో 12.6 శాతం వృద్ధి నమోదైంది. భక్తుల రద్దీ పెరుగుదలతో ఆలయ ఆదాయాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!