
న్యూస్

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా సాధికారతకు కీలకమైన చారిత్రాత్మక అవకాశాన్ని అడ్డుకోవడం ద్వారా మహిళలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఇండి కూటమి వైఖరిని తప్పుబడుతూ ఆయన స్పందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ బిల్లుకు తన మద్దతును వెల్లడించారు. ఇది కేవలం రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, సమాన హక్కులు మరియు సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న కోట్లాది మహిళలకు చేసిన ద్రోహమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీల ఈ వైఖరిని దేశం గుర్తుంచుకుంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!