
న్యూస్

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి ఉంటే వారికి మరింత గౌరవం దక్కేదని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ బిల్లును లోక్‌సభకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో ఆనందించేవారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!