

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఓట్ల లెక్కింపులో జరిగిన తప్పిదాల కారణంగా ఓడిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించినట్లు కోర్టు విచారణలో బయటపడింది. ముమ్మిడివరం మండలం గాడిలంక పంచాయతీ ఎన్నిక చెల్లదని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు ఇవ్వడంతో అసలు ఫలితం వెలుగులోకి వచ్చింది.
కోర్టులో మళ్లీ ఓట్ల లెక్కింపు జరిపినప్పుడు చెల్లని ఓట్లను తప్పుగా లెక్కించినట్లు తేలింది. ఈ మార్పులతో తెదేపా మద్దతుదారు వెంకటకృష్ణారావు 14 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు నిర్ధారితమైంది. అయితే అధికారికంగా ప్రకటించిన ఫలితాల వల్ల ప్రత్యర్థి అభ్యర్థి ఐదేళ్లు పదవిలో కొనసాగడం వివాదాస్పదంగా మారింది. ప్రజలు గెలిపించినా పదవిని పొందలేకపోయానని వెంకటకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తూ, అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!