

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అమరావతిలో శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుళ్ల ఘటనపై అధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలు మరియు పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలపై కఠిన తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అన్ని యూనిట్లు భద్రతా ప్రమాణాలు, నిబంధనలు మరియు అనుమతించిన పరిమితులను కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో అధికారులు పరిశీలించాలని తెలిపారు.
ఇళ్లలో లేదా అనుమతి లేని ప్రాంతాల్లో బాణాసంచా లేదా పేలుడు పదార్థాలను నిల్వ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు మంజూరు చేసిన అనుమతులను పునఃసమీక్షించి పదిహేను రోజులలోపు అన్ని నిల్వ కేంద్రాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో బాణాసంచా తయారీలో పాటిస్తున్న భద్రతా విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 95 బాణాసంచా యూనిట్లలో ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నాయో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!