

తెలంగాణ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ జోర్దార్ సుజాత మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించిన ఆమె, తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కనిపించారు. ఆ తర్వాత ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సుజాత, ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇదే సమయంలో తాజాగా జోర్దార్ సుజాతకు మా అసోసియేషన్ సభ్యత్వం లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మా సభ్యురాలిగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడివరకు చేరుకోవడానికి తన అభిమానుల ఆశీర్వాదమే కారణమని ఆమె తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రోత్సహించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు సభ్యత్వ గుర్తింపు కార్డు అందజేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!