

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ప్రత్యేక శైలిలో తెరకెక్కించిన ‘స్లమ్‌డాగ్’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ పరాజయాల తర్వాత ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే సినిమా విడుదల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాకపోవడం వల్లే రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే డిజిటల్ హక్కులు పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. పూరీ గత చిత్రాల ఫలితాల ప్రభావంతో ఓటీటీ సంస్థల నుంచి ఆశించిన స్థాయి ఆఫర్లు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కొన్ని ఆర్థిక వివాదాలు కూడా సినిమా విడుదలపై ప్రభావం చూపుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన బకాయిల అంశంపై ఫిలిం ఛాంబర్‌లో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, ఈ చిత్రం ఒక ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. ‘మనీ హీస్ట్’ తరహా జోనర్‌లో విజయ్ సేతుపతి అంధుడైన బిచ్చగాడి పాత్రలో కనిపిస్తారనే లీక్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. టబు, సంయుక్త, దునియా విజయ్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రానికి బలంగా నిలుస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమిళనాడు ఎన్నికల కారణంగా ప్రమోషన్స్ ఆలస్యమయ్యాయని కూడా టాక్ ఉంది. అన్ని అంశాలు అనుకూలిస్తే ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఐదు భాషల్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.



















.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!